మెగాస్టార్ 'ఆచార్య' సెట్‌కు సోనూ ఫ్యాన్స్‌!

మెగాస్టార్ ఆచార్య సెట్‌కు సోనూ ఫ్యాన్స్‌!
x
Highlights

సోనూసూద్ కి కలవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆచార్య సినిమా షూటింగ్ లో సోనూసూద్ ఉన్నట్టుగా తెలుసుకొని అభిమానులు అక్కడికి చేరుకొని సోనూసూద్ వ్యాన్‌ను చుట్టుముట్టారు. ఆ తర్వాత సోనూసూద్ బయటకు వచ్చి అభిమానులను పలకరించారు

సోనూసూద్ .. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. సహాయానికి నిలువెత్తు నిదర్శనం అయన .. కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ టైంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకపోయిన వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపకుండా కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు అక్కడ సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు.

దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. అయన సేవలకి గాను ప్రధాని మోడీతో పాటుగా చాలా మంది సోనూసూద్ ని ప్రశంసించారు. అటు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌డిపి) ఎస్‌డిజి స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యూత్ లో సోనూసూద్ కి వీపరితమైన క్రేజ్ ఏర్పడింది.

ఇక ఇదలా ఉంటే ప్రస్తుతం ఆచార్య మూవీ సినిమా షూటింగ్ లో ఉన్న సోనూసూద్ కి కలవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఆచార్య సినిమా షూటింగ్ లో సోనూసూద్ ఉన్నట్టుగా తెలుసుకొని అభిమానులు అక్కడికి చేరుకొని సోనూసూద్ వ్యాన్‌ను చుట్టుముట్టారు. ఆ తర్వాత సోనూసూద్ బయటకు వచ్చి అభిమానులను పలకరించారు. ఇక అభిమానులు కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

అటు ఆచార్య విషయానికి వచ్చేసరికి ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories