Samantha: సమంత సినిమాకి భారీ కాంపిటేషన్

Samantha: మూడు సినిమాలతో పోటీ పడనున్న సమంత సినిమా

Dhatripriya
Published on: 18 March 2023 11:41 AM IST
Huge Competition For The Samantha Movie
X

Samantha: సమంతా సినిమాకి భారీ కాంపిటేషన్

Samantha: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న "శాకుంతలం" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మైథలజికల్ ఎపిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సింది కానీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఈ సినిమా వచ్చే నెల 15వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వ్యవహారించిన ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

ఈ మధ్యనే ఈ సినిమా ఫైనల్ కాపీ చూసిన సమంత సోషల్ మీడియాలో సినిమాని, డైరెక్టర్ ని పొగుడుతూ కామెంట్లు చేసింది. అసలు "శాకుంతలం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోనే సమంత మళ్లీ మీడియా ముందుకి వచ్చింది. ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉండడంతో త్వరలోనే సమంత సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్లలో కూడా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తుందట. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి అనుకోని కాంపిటేషన్ వచ్చి పడింది.

నాని హీరోగా నటిస్తున్న "దసరా" సినిమా మార్చి 30 న విడుదలవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత "రావణాసుర" అనే సినిమాతో ఏప్రిల్ 7 న ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. మరోవైపు సాయి ధరంతేజ్ కూడా చాలాకాలం తర్వాత "విరూపాక్ష" సినిమాతో ఏప్రిల్ 21న థియేటర్ల ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ మూడు సినిమాలకి పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు ను తట్టుకొని సమంత సినిమా బాగా ఆడాలంటే కచ్చితంగా మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ రావాల్సిన అవసరం ఉంది. మరి సమంత సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story