Pavan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాల బిజినెస్‌లో భారీ మార్పులు

Pavan Kalyan: ప్రస్తుతం రెండు రిమేక్‌ సినిమాల్లో నటిస్తున్న పవన్‌

Sandeep Eggoju
Published on: 4 March 2021 8:54 AM IST
Huge changes In Pavan Kalya Movie Business
X

వకీల్ సాబ్ (ఫైల్ ఇమేజ్)

Pavan Kalyan: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా బిజినెస్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే.. ఇప్పుడు పవన్‌ సినిమాల బిజినెస్‌లో భారీ మార్పులొచ్చాయి. హిట్‌, ప్లాప్‌తో సంబంధం లేకుండా పవర్‌స్టార్‌ క్రేజ్‌ రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుంది. పవన్‌కు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి సినిమా బిజినెస్ కూడా బాగా పెరుగుతోంది. ఇక్కడ పవన్ బిజినెస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. వకీల్ సాబ్ కు ముందు.. వకీల్ సాబ్ తర్వాత అని మాట్లాడుకోవాలి. ఎందుకంటే తాజాగా పవన్ రీమేక్ సినిమాలకు అయిన భారీ బిజినెస్‌ ఏ దానికి ఉదాహరణ.

ప్రస్తుతం వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న వకీల్‌ సాబ్‌తో పాటు మరొక యువ దర్శకుడు సాగర్‌ కె.చంద్ర తీస్తున్న అయ్యప్పణం కోషియం సినిమాల్లో పవన్ నటిస్తున్నారు. ఈ రెండు రీమేక్ సినిమాలకు సంబంధించి బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. వకీల్‌సాబ్‌ నాన్‌ థియేటర్‌ హక్కులను ఓ ప్రముఖ మీడియా కంపెనీ సుమారు 31 కోట్లకు దక్కించుకుంది.

పరభాషల్లో హిట్‌ అయిన సినిమాలు ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ చేస్తుండటంతో.. డిస్ట్రిబ్యూటర్లే కాదు, డిజిటల్‌ కంపెనీలు కూడా ప్యాన్సీ రేటు ఇచ్చి రైట్స్‌ సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. మరి.. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్‌లో హై బజ్‌ క్రియేట్‌ చేసిన వకీల్‌ సాబ్‌, అయ్యప్పణం కోషియం రిమేక్‌ సినిమాలు విడుదల తర్వాత ఏ స్థాయి బిజినెస్‌ చేస్తాయో చూడాలి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story