SS Rajamouli: ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి ఎలా హ్యాండిల్ చేశారు..?

SS Rajamouli: ఇద్దరు హీరోలను తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా చూపించారు...

admin1
Updated on: 27 March 2022 2:00 PM IST
How SS Rajamouli Handled Two Star Heros Jr NTR and Ram Charan | Live News
X

SS Rajamouli: ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి ఎలా హ్యాండిల్ చేశారు..? 

SS Rajamouli: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానులు అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఇద్దరు స్టార్ హీరోలని రాజమౌళి ఎలా హ్యాండిల్ చేశారు అని.

ఇద్దరు హీరోల అభిమానులు సాటిస్ఫై చేసే లాగా హీరోలకు ఒకే ప్రాధాన్యత ఉందా లేదా అని అభిమానులు ఎప్పటికప్పుడు రాజమౌళిని అడుగుతూనే వచ్చారు. తాజాగా విడుదలైన ఈ సినిమాతో ఆ డౌట్ లి అన్నీ క్లియర్ చేశారు రాజమౌళి. ఇద్దరు హీరోలను తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా చూపించారు. ఇంట్రడక్షన్ సన్నివేశాలు కానీ, వారిద్దరూ మొట్టమొదటిసారిగా కలుసుకునే సన్నివేశాలు కానీ, వారిద్దరి మధ్య జరిగే ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా తెరకెక్కించారు రాజమౌళి.

ఇక క్లైమాక్స్ లో ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. బాహుబలి 2 తర్వాత "ఆర్ ఆర్ ఆర్" తో రాజమౌళి మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరో వైపు ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఏమాత్రం కంగారు పడకుండా సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చని క్రిటిక్స్ కూడా చెబుతున్నారు.

admin1

admin1

Next Story