ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ పై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

Agent: ఏజెంట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్న చిత్ర బృందం

Jyothi
Updated on: 11 April 2023 8:30 PM IST
How Does the Agent Film Team Decide on Promotional Content?
X

ఏజెంట్ ప్రమోషనల్ కంటెంట్ పై చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది?

Agent: ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా కి ఈనెల 28వ తేదీన విడుదల కి సిద్ధమవుతోంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తవ్వాల్సి ఉంది అని మరోవైపు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడటంతో ఎప్పటికప్పుడు సినిమా మీద క్రియేట్ అయిన బజ్ మొత్తం తగ్గిపోయింది. ప్రేక్షకులలో కూడా ఈ సినిమా చూడాలి అనే ఆసక్తి చాలా వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం భారీ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

ఇప్పటిదాకా విడుదలైన చిత్ర టీజర్లు మరియు పాటలు కూడా ప్రేక్షకులను అంత బాగా అలరించలేకపోయాయి. సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులలో ఆసక్తి కంటే ఎక్కువగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. తర సమాచారం ప్రకారం ఈ సినిమాలో సురేందర్ రెడ్డి స్టైల్ నెరేషన్, భారీ నిర్మాణ విలువలు సినిమాకి బాగా ప్లస్ అవుతాయని తెలుస్తోంది. ఇక అవసరమా విడుదల కూడా బాగా దగ్గర పడుతుండడంతో మరింత ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరి ఇకపైనైనా తమ ప్రమోషనల్ కంటెంట్ తో చిత్రబృందం ఎంత వరకు సినిమా పై ఆసక్తిని పెంచుతుందో వేచి చూడాలి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్యాన్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ప్రముఖ మలయాళం నటుడు మమ్ముట్టి, డీనో మోరియా మరియు విక్రమ్ జీత్ విర్క్ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Jyothi

Jyothi

Next Story