"వాల్తేరు వీరయ్య" సినిమాలో హాట్ సన్నివేశం

Hot Scene in Waltair Veerayya Movie
x

"వాల్తేరు వీరయ్య" సినిమాలో హాట్ సన్నివేశం

Highlights

Waltair Veerayya: చిరు సినిమాలో హీరోయిన్ కి లిప్ లాక్ ఇచ్చిన రవితేజ

Waltair Veerayya: ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి విజయాన్ని సాధించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక సన్నివేశం గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ సినిమాలో ఒక హాట్ సీన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది చిరంజీవి మరియు శృతిహాసన్ కి మధ్య కాదని రవితేజ మరియు కేథరిన్ తెరీసాలకి మధ్య అని సమాచారం. ఈ సినిమాలో రవితేజ మరియు కేథరిన్ తెరీసాలకి మధ్య ఒక హాట్ లిప్ లాక్ సన్నివేశం ఉందట. ఈ మధ్యనే ఈ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తోంది. నిజానికి కేథరిన్ తెరీసా లిప్ లాక్ సన్నివేశాలకి నో చెప్తూ ఉంటుంది.

కానీ ఈ సినిమాలో మాత్రం సీన్ డిమాండ్ చేయడంతో ఆమె ఒప్పుకోక తప్పలేదని సమాచారం. ప్రస్తుతం "వాల్తేరు వీరయ్య" సినిమా బృందం విదేశాల్లో ఉంది. చిరంజీవి మరియు శృతిహాసన్ మధ్య ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈనెల మూడవ వారంలోగా షూటింగ్ తో పాటు నిర్మాణాంతర పనులు కూడా పూర్తవుబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చిత్ర బృందం ప్రమోషన్స్ లో పాల్గొనడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రెండు టీజర్లు ఒక పాట విడుదలయ్యాయి. త్వరలోనే మరొక పాటను విడుదల చేయబోతోంది చిత్ర బృందం.

Show Full Article
Print Article
Next Story
More Stories