Liger Movie Update: 'లైగర్' కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్

Liger Movie Update:(Photo Twitter)
Liger Movie Update: కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడానికి ఆండీ లాంగ్ లైగర్ కోసం పనిచేస్తున్నారు.
Liger Movie Update: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యూత్‌లో క్రేజీ స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `లైగర్`. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం కాబోతుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను పూర్తిగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు పూరీ భారీగానే ప్లాన్ చేస్తున్నాడట. ఇందుకోసం ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ డిజైన్ చేయడానికి ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ లైగర్ కోసం పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించంది చిత్రయూనిట్. ఆండీ లాంగ్ జాకీచాన్ సినిమాలతోపాటు పలు హాలీవుడ్ చిత్రాలకు కూడా వర్క్ చేశాడు. ఇప్పటికే ఆండీ తన యూనిట్‌తో కలిసి స్పెషల్‌గా కొన్ని యాక్షన్ సీన్స్ రెడీ చేస్తున్నట్లుగా టాక్.
ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్, చార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లయన్, టైగర్ క్రాస్ బ్రీడ్ `లైగర్`. కాబట్టి అలాంటి ఓ పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టిన పూరీ జగన్నాథ్ `సాలా క్రాస్ బ్రీడ్` అనే క్యాప్షన్‌ను కూడా పెట్టుకున్నారు.
జనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMT
Jogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?
22 May 2022 1:30 PM GMTభారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు
22 May 2022 1:00 PM GMTబారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..
22 May 2022 12:30 PM GMTPawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని...
22 May 2022 11:51 AM GMTశేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేత .. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్..
22 May 2022 11:20 AM GMT