సినిమాల్లోకి 'టిక్ టాక్ దుర్గారావు'!

Durga Rao
Durga Rao With HMTV : టిక్ టాక్ పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకున్నారు. అందులో కొందరు బాగా క్లిక్ అయ్యారు.. అందులో ఒకరు దుర్గారావు.. తన భార్యతో కలిసి దుర్గారావు చేసిన వీడియోలు బాగా ట్రెండ్ అయ్యాయి..
Durga Rao With HMTV : టిక్ టాక్ పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ నిరూపించుకున్నారు. అందులో కొందరు బాగా క్లిక్ అయ్యారు.. వారిలో ఒకరు దుర్గారావు.. తన భార్యతో కలిసి దుర్గారావు చేసిన వీడియోలు బాగా ట్రెండ్ అయ్యాయి.. ఎక్కడ చూసిన వీరి గురించే చర్చ.. ఓ హీరోకి ఉన్న క్రేజ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో దుర్గారావుకు ఉంది. ఆయన పేరుమీద దుర్గారావు నాట్యమండలి అనే అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయంటే అర్ధం చేసుకోవచ్చు దుర్గారావుకి ఉన్న ఫాలోయింగ్ ఏంటో.. ఇక ఇది ఇలా ఉంటే టిక్ టాక్ లోకి రాకముందు దుర్గారావు ఎం చేసేవాడు? టిక్ టాక్ బ్యాన్ అయ్యాక దుర్గారావు ఎం చేస్తున్నాడు? దుర్గారావుకి సినిమా ఛాన్సులు వచ్చాయా? అని తెలుసుకోవడానికి దుర్గారావు దంపతులతో చిట్ చాట్ చేసింది HMTV..
టిక్ టాక్ చేయకముందు నటన అంటే ఇష్టమని దుర్గారావు అన్నాడు.. సినిమా లోని పాటలు చూస్తూ డాన్స్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. దానినే టిక్ టాక్ లోనే చేసేనని చెప్పుకొచ్చాడు. తన ఇంట్రెస్ట్ కి తన భార్య కూడా తోడైందని వెల్లడించాడు. ఇక తమకి బాగా పేరు తీసుకొచ్చిన "నక్కిలేసు గొలుసు" పాట గురించి మాట్లాడుతూ.. ఆ పాట వల్లే తాము ఫేమస్ అయ్యామని సంగీత దర్శకుడు రఘుకుంచెకి చెబితే అయన హైదరాబాదు పిలిపించి సన్మానం చేసినట్టుగా దుర్గారావు చెప్పుకొచ్చాడు. అయితే "నక్కిలేసు గొలుసు" పాట తాము చేయడం వల్లే ఫేమస్ అయినట్టుగా రఘుకుంచె చెప్పారని దుర్గారావు తెలిపాడు. అంతేకాకుండా 44 వేల రూపాయల మైక్ ని బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. ఇక శేఖర్ మాస్టర్ కూడా అభినందిచినట్టుగా చెప్పుకొచ్చారు.
టిక్ టాక్ వల్ల ఇంత ఫేమస్ అవుతాను అని అనుకోలేదని దుర్గారావు వెల్లడించాడు. ఓ వీడియో పెట్టి పొలం పనులకి వెళ్ళేవాడిని వచ్చి చూసేసరికి లైక్స్ బాగా వచ్చేవని, అవే తనని ఇంకా వీడియోలు చేసేలా చేశాయని దుర్గారావు చెప్పుకొచ్చాడు. తనని ఆదరించిన ప్రతి ఒక్కరికి దుర్గారావు ధన్యవాదాలు తెలిపాడు.. నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయని, అయితే అవి తాము పట్టించుకోలేదని దుర్గారావు భార్య గంగరత్నం చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్, అదిరింది షోలలో అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. పలాస మూవీ దర్శకుడు కరుణ కుమార్ చేయబోయే తదుపరి చిత్రంలో అవకాశంలో అవకాశం ఇచ్చినట్టుగా వెల్లడించాడు దుర్గారావు..
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT