HIT 3 in OTT: ఓటీటీలోకి ‘హిట్‌ 3’.. అధికారికంగా ప్రకటించిన సంస్థ

HIT 3 in OTT: ఓటీటీలోకి ‘హిట్‌ 3’.. అధికారికంగా ప్రకటించిన సంస్థ
x
Highlights

HIT 3 in OTT: నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ (HIT 3) మే 1న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.

HIT 3 in OTT: నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’ (HIT 3) మే 1న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 29 నుంచి స్ట్రీమింగ్‌కి రానుంది. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ మూడో భాగంలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా, రావు రమేశ్‌, సూర్య శ్రీనివాస్‌, అదిల్ పాలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కథ విషయానికి వస్తే…

అర్జున్ సర్కార్ (నాని) అనే ఐపీఎస్ అధికారి జమ్మూ కశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (HIT)లో విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ దారుణమైన హత్య కేసు వెలుగులోకి వస్తుంది. దాన్ని దర్యాప్తు చేస్తుండగా, దేశవ్యాప్తంగా ఇదే తరహాలో మరో 13 హత్యలు జరిగినట్టు తెలుస్తుంది. వీటి వెనుక ఒక శక్తివంతమైన నెట్‌వర్క్ పనిచేస్తుందన్న విషయం అర్జున్ గ్రహిస్తాడు. ఈ కేసును ఛేదించేందుకు బిహార్‌, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలకు వెళ్లిన అతడు, ఆ మధ్య విశాఖపట్నానికి బదిలీ అవుతాడు. అక్కడికొచ్చిన తరువాత కూడా ఈ కేసు వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయటానికి ప్రయత్నిస్తాడు. వరుస హత్యల వెనక ఉన్న రహస్యాలు, చీకటి కోణాలు, దాన్ని చేయిస్తున్నదెవరు? అన్నది తెరపై ఆసక్తికరంగా చూపించారు. అలాగే, అర్జున్‌కి మృదుల (శ్రీనిధి శెట్టి)కి మధ్య ఉన్న అనుబంధం ఏంటీ? ఆమె పాత్ర కథలోకి ఎలా వస్తుంది? అన్నది కూడా చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది.

థ్రిల్లర్ జానర్ ప్రేమికులు తప్పక చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories