HIT 2 Movie Collections: "హిట్ 2" డే 1 కలెక్షన్లు ఇలా ఉన్నాయి

HIT 2 Movie Box Office Collection Day 1
x

HIT 2 Movie Collections: "హిట్ 2" డే 1 కలెక్షన్లు ఇలా ఉన్నాయి

Highlights

HIT 2 Movie Collections: ఈ మధ్యనే "మేజర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో అడవి శేష్ తాజాగా ఇప్పుడు "హిట్: ది సెకండ్ కేస్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

HIT 2 Movie Collections: ఈ మధ్యనే "మేజర్" సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో అడవి శేష్ తాజాగా ఇప్పుడు "హిట్: ది సెకండ్ కేస్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా అయిన "హిట్: ది ఫస్ట్ కేస్" సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది.

అనుకున్న విధంగానే "హిట్ 2" సినిమాకి కూడా మంచి స్టార్ట్ లభించింది. కేవలం నైజాం ఏరియాలోనే ఈ చిత్రం మొదటి రోజున దాదాపుగా 1.95 కోట్ల వసూళ్లను నమోదు చేసుకుంది. ఇక సీడెడ్ ఈ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్లు 40 లక్షలు కాగా యుఏ లో 50 లక్షలు నమోదు చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కృష్ణాలో 24 లక్షలు, గుంటూరులో 34 లక్షలు, మిగతా ఏరియా నుండి 65 లక్షలు, మొదటి రోజే గడించింది ఈ సినిమా.

ఇక ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్ర ఫస్ట్ డే కలెక్షన్లు 4.1 కోట్లు. భారతదేశంలోని మిగతా ఏరియాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. "హిట్ 2" కూడా సూపర్ హిట్ అవడంతో అడవి శేష్ ఇప్పుడు అధికారికంగా టైర్ 2 హీరోల జాబితాలోకి చేరిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు 2.2 కోట్లు కాగా ప్రపంచవ్యాప్తంగా సినిమా మొదటి రోజు కలెక్షన్లు 6.3 కోట్లు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, సుహాస్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories