RRR: సూర్యుడు మంటమీదున్నాడు జాగ్రత్త..ఫ్యాన్స్ మీమ్స్, సెటైర్స్.. వైరల్

RRR Movie Updates
x

ఆర్ఆర్ఆర్ ఫైల్ ఇమేజ్

Highlights

RRR:నీళ్లు బాగా తాగి చల్లగా ఉండాలంటూ సూచన

RRR: మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి చిన్నఅప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్‌కు పండగే. అయితే.. ఇవాళ వచ్చిన అప్‌డేట్‌పై మాత్రం అదే ఫ్యాన్స్ బీభత్సమైన ట్రోల్స్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ పెరిగిపోవడంతో ప్రజలకు కీలక సూచనలు చేస్తూ ట్విట్టర్ వేదికగా RRR అడ్మిన్ ఓ పోస్ట్ చేశారు. "వడగాడ్పుల అలర్ట్' అంటూ పోస్ట్ చేసిన RRR టీమ్... ''సూర్యుడు మంట మీదున్నాడు.. జాగ్రత్త ఉండండి. నీరు ఎక్కువగా తాగండి.. ఎప్పుడూ చల్లగా ఉండండి'' అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.

నిజానికి RRR మూవీలో రామ్ చరణ్ ను అల్లూరిగా పరిచయం చేసిన రాజమౌళి.. నిప్పుగా చూపించాడు. తారక్ ను కుమ్రం భీంగా ప్రెజెంట్ చేసి.. నీరుగా అందరికీ పరిచయం చేశాడు. ఈ రెండు పాత్రలనూ ముడిపెట్టి RRR అడ్మిన్ ట్వీట్ చేశారు. ఇంకేముందీ RRR ట్విట్టర్ అకౌంట్ నుంచి నోటిఫికేషన్ రాగానే ఫ్యాన్స్ అప్‌డేట్ అనుకుని ట్విట్టర్‌పై దాడి చేశారు. తీరా సమ్మర్ ప్రికాషన్స్ కనపడే సరికి ఫ్యాస్ డిసప్పాయింట్ అయ్యారు. ఇంకేముంది RRR ట్విట్టర్ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

కొంత మంది మీమ్స్‌తో నవ్విస్తే.. మరికొందరు కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వీటికి మాత్రం తక్కువేం లేదు' అంటూ సెటైర్లు వదులడమే కాదు.. 'హ్యాపీ ఫూల్స్ డే బ్రో' అంటూ రిప్లైలు ఇస్తున్నారు. అప్ డేట్స్ ఏమైనా ఉన్నాయా.. ఇవేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎండాకాలం షూటింగ్ ఆపాలని, పోస్ట్ పోన్ చేయాలని ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి? అంటూ జోకులు పేలుస్తున్నారు. దీంతో RRR ట్విట్టర్ ఖాతా ట్రెండింగ్‌లోకి వెళ్లింది.




Show Full Article
Print Article
Next Story
More Stories