"నయనతార నా పాత్రను కట్ చేసేసింది," అంటున్న హీరోయిన్లు

* సినిమాలోని తన ఫుటేజ్ ని నయనతార కట్ చేసేసింది అంటున్న హీరోయిన్లు

Dhatripriya
Published on: 13 March 2023 5:11 PM IST
Heroines Saying Nayanthara Cut My Role
X

"నయనతార నా పాత్రను కట్ చేసేసింది," అంటున్న హీరోయిన్లు 

Nayanthara: లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి పేరు సృష్టించుకున్న హీరోయిన్ నయనతార. తమిళ్, తెలుగు భాషల్లో నయనతారకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ నయనతార మేకప్ గురించి చేసిన కామెంట్లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

హాస్పిటల్లో చచ్చిపోతున్న సీన్లో ఫుల్లుగా మేకప్ వేసుకొని ఒక హీరోయిన్ నటించింది అంటూ నయనతార గురించి చెప్పుకొచ్చింది మాళవిక. ఆ తర్వాత నయనతార కూడా ఈమెకు స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది. డైరెక్టర్ ఎలా చేయమంటే అలానే చేస్తానని కమర్షియల్ సినిమాలకి మరియు రియలిస్టిక్ సినిమాలకి చాలా తేడా ఉంటుందని కమర్షియల్ సినిమాల్లో అంత ఇదిగా ప్రతి డీటెయిల్ చూడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు మరొక హీరోయిన్ నయనతార మీద షాకింగ్ కామెంట్లు చేసింది.

ఆమె మమతా మోహన్ దాస్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ "కుశలన్ (తెలుగులో కథానాయకుడు)" సినిమాలో తాను ఒక పాటలో నటించానని కానీ నయనతార తన పాత్ర ఫుటేజ్ ను సినిమాలో నుండి తీసేసింది అని చెప్పుకొచ్చింది. తను నటిస్తుండగా మరొక హీరోయిన్ అవసరం ఏముందని అని నయనతార మమతా మోహన్ దాస్ నటించిన పోర్షన్స్ ను కట్ చేయించేసిందని కామెంట్లు చేసింది మమతా. మరి మమతా మోహన్ దాస్ కామెంట్లకు నయనతార ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story