యాంకర్ గా మారిన హీరోయిన్!

యాంకర్ గా మారిన హీరోయిన్!
x
Highlights

Vithika Turns Tv Anchor : బిగ్ బాస్ సీజన్ 3లో తన భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి జంటగా వచ్చి అందరిని అలరించింది నటి వితిక శేరు.. ఈ షోలో ఆమె 13 వారాలు హౌస్‌లో ఉండి ఆకట్టుకుంది.

Vithika Turns Tv Anchor : బిగ్ బాస్ సీజన్ 3లో తన భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి జంటగా వచ్చి అందరిని అలరించింది నటి వితిక శేరు.. ఈ షోలో ఆమె 13 వారాలు హౌస్‌లో ఉండి ఆకట్టుకుంది. వాస్తవానికి ఈ షోకు ముందు వితిక శేరు అంటే ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పాలి.. కానీ ఈ షోతో వితిక శేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. తాజాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆమె చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి..

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు వితిక శేరు కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతుంది. త్వరలో అందరికి ఓ యాంకర్ గా కనిపించబోతుంది వితిక శేరు.. అవును.. ప్రముఖ టీవీ ఛాన‌ల్ లో ప్రసారం కానున్న సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న షోకు యాంక‌ర్ గా ప‌నిచేయ‌నుంది వితిక.. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడిచింది వితిక.. యాంక‌ర్ గా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. మీరంతా న‌న్ను ఎప్పుడు టీవీ లో చూస్తార‌ని ఎదురుచూస్తున్నా అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది.

ఇక పెళ్ళికి ముందు వితిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.. తన భర్త వరుణ్ తో కలిసి పడ్డానండి ప్రేమలో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతకుముందు సందడి, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్ మొదలగు సినిమాలలో నటించి మెప్పించింది వితిక.. ఇక వరుణ్ సందేశ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో వితికా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి!

Show Full Article
Print Article
Next Story
More Stories