Trisha Krishnan: పెళ్లి పీటలు ఎక్కనున్న త్రిష

Trisha: మొన్న అనుష్క పెళ్లి వార్త.. నేడు త్రిష కూడా పెళ్లిపీటలు ఎక్కనుందన్న న్యూస్ వైరల్ గా మారింది.

Venkata Chari
Updated on: 3 May 2021 7:50 PM IST
‌Heroine Trisha Marriage With Businessmen
X

త్రిష (ఫొటో ట్విట్టర్)

Trisha: మొన్న అనుష్క శెట్టి పెళ్లి వార్త నెట్టింట్లో హల్ చల్ చేయగా.. నేడు 'వర్షం' ఫేమ్ త్రిష కూడా పెళ్లిపీటలు ఎక్కుతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. ఈ ఏజ్ బారైన బ్యూటీ... ప్రస్తుతం ఖాళీగా ఉంది. సినిమా ఛాన్సులు లేకపోవడమో.. ఏజ్ పెరగడమో.. కారణం ఏదైనా గానీ, ప్రస్తుతం వీరి మనసు పెళ్లిపై పడిందని టాక్ వినిపిస్తోంది.

కాగా, అనుష్కశెట్టి దుబాయ్ వ్యాపారిని వివాహం చేసుకోనుందని వార్తలు వినిపించాయి. తాజాగా త్రిష కూడా ఓ బిజినెస్ మెన్‏తో పెళ్లి మండపం వైపు అడుగులు వేస్తుందని టాక్. త్రిష కృష్ణన్… ఫేయిర్ అండ్ లవ్లీ యాడ్‏తో సినీ ఛాన్స్ కొట్టేసి.. కోలీవుడ్, టాలీవుడ్‏లో అగ్రహీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న మోడల్ కమ్ హీరోయిన్. దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకుంది. మోడల్‏గా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రిష.. ఆ తర్వాత టాప్ హీరోయిన్‏గా ఎదిగింది.

వెంకటేశ్, చిరంజీవి, మహేశ్ వంటి స్టార్ హీరోలతో నటించిన త్రిష.. దక్షిణాదిలో బాగా ఫేమస్ అయిపోయింది. తనకంటూ ప్రత్యేమైన స్టార్ డమ్ ను సంపాదించుకుంది. గతంలో ఓ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయింది. ఎంగేజ్‏మెంట్ కూడా చేసుకున్నారు. ఏం జరిగిందో కారంణం తెలీదు కానీ.. వారి పెళ్లి కంచికి చేరింది. మరలా ఇన్నాళ్లకు త్రిష పెళ్లి కబురు మరోసారి ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. తన పెళ్లిపై ఓ నిర్ణయాన్ని తీసుకున్న త్రిష .. ఈ క్రమంలోనే ఓ బిజినెస్‏మెన్‏తో పెళ్లికి సిద్ధమైందట. పెళ్లి విషయమై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయంట. ఈ మేరకు త్రిష వివాహంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story