Sreeleela: నిర్మాతలతో భారీగా ఖర్చులు పెట్టిస్తున్న శ్రీ లీల

Sreeleela: నిర్మాతలతో భారీగా ఖర్చులు పెట్టిస్తున్న శ్రీ లీల

Rama Rao
Updated on: 16 Sept 2022 8:30 PM IST
Heroine Sreeleela is Spending Money Heavily with the Producers
X

Sreeleela: నిర్మాతలతో భారీగా ఖర్చులు పెట్టిస్తున్న శ్రీ లీల

Sreeleela: "పెళ్లి సందడి" సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీ లీల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఒక్క సినిమాకే స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ భామ చేతిలో కొన్ని మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కేవలం ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ శ్రీలీల డిమాండ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఆమె తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా షూటింగ్ సమయంలో కూడా తన స్టే విషయంలో ఈ భామ నిర్మాతలతో బీభత్సంగా ఖర్చులు పెట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీ లీల తన అమ్మగారితో కలిసి వచ్చే ఒక నెలపాటు హోటల్లోనే ఉండబోతోంది. దీనికోసం నిర్మాతలతో ఆమె నెల రోజులకి సెవెన్ స్టార్ హోటల్ ను బుక్ చేయించిందట. ఇక 21 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది.

ఈ హోటల్ రూమ్ కోసం రోజుకి 22000 ఖర్చు అవుతుందట. మొత్తం స్టే పూర్తయ్యే నాటికి నిర్మాతలు కేవలం శ్రీ లీల మరియు వాళ్ళ అమ్మ గారి హోటల్ స్టే కోసమే ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగతా ఖర్చులకోసం సులువుగా మూడు నుంచి నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది. ఒకవైపు భారీ రమేనరేషన్ ను సమర్పించుకోవడం మాత్రమే కాక శ్రీ లీల ఇలా ఎక్స్ట్రాగా నిర్మాతలతో దాదాపు పది లక్షల దాకా ఖర్చు పెట్టించటం అందరిని షాక్ కి గురిచేస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story