Sreeleela: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన శ్రీ లీల

Sreeleela: ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ పెంచుతూ వస్తున్న "పెళ్లిసందడి" భామ

admin1
Updated on: 3 Feb 2022 3:00 PM IST
Heroine Sreeleela is Increasing the Remuneration for Each Movie | Tollywood News Today
X

Sreeleela: రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన శ్రీ లీల 

Sreeleela: ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఒక్క సినిమా సూపర్ హిట్ అయితేనే తమ రెమ్యునరేషన్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకు వెళ్ళిపోతున్నారు. ఒకపక్క హీరోలు మాత్రమే కాక మరో వైపు హీరోయిన్లు కూడా ఈ విషయంలో చక్రం తిప్పుతున్నారు. స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకి రెండు మూడు కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అందులోనూ ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే చాలు వాళ్ల పారితోషికానికి రెక్కలొచ్చినట్టే. ఈ మధ్యనే "ఉప్పెన" సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న కృతి శెట్టి తన తదుపరి సినిమా నుండి భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఇప్పుడు ఈ జాబితాలో చేరిన మరొక హీరోయిన్ శ్రీ లీల.

రాఘవేంద్ర రావు "పెళ్లి సందడి" తో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం అయింది శ్రీ లీల. శ్రీకాంత్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈమె కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. మొదటి సినిమా హిట్ అవడంతో రెండవ సినిమా నుంచి ఈమె రెమ్యునరేషన్ను భారీగా పెంచేసింది. మొదటి సినిమాకి కేవలం ఐదు లక్షల పారితోషికాన్ని మాత్రమే అందుకున్న శ్రీ లీల తన రెండవ సినిమా కి 40 లక్షల తీసుకోబోతోంది. ఈ మధ్యనే తన మూడవ సినిమా కూడా సైన్ చేసిన శ్రీ లీల ఈ సినిమాకి 75 లక్షలు తీసుకొబోతుందట. ఇకపై శ్రీ లీల తో సినిమా చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనేమో.

admin1

admin1

Next Story