Maha Samudram: శర్వానంద్ సినిమాలో సీనియర్ హీరోయిన్ స్పెషల్ సాంగ్?

Heroine Ramba in Special Song in Maha Samudram Movie
x

మహాసముద్రం మూవీలో సీనియర్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Maha Samudram: మహా సముద్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ మోడ్‌లో ఉంది.

Maha Samudram: మహా సముద్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్ మోడ్‌లో ఉంది. కాగా, ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ పై కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజా నివేదికల మేరకు సీనియర్ హీరోయిన్ రంభ ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోందని తెలుస్తోంది. ఈ పాటను త్వరలో చిత్రీకరించాలని దర్శకుడు అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రంభ అభిమానిగా కనిపిస్తాడంట. ఈ చిత్రం షూట్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ఈ స్పెషల్ పాటను కూడా అక్కడే చిత్రీకరించడానికి ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా, ఈ చిత్రంతో హీరో సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories