Raashi Khanna Undiporaadhey Song :ఆ పాటతో నెటిజన్లను ఫిదా చేస్తున్న రాశీఖన్నా

Raashi Khanna Undiporaadhey Song : నటుడు అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి

Krishna
Published on: 18 Aug 2020 4:08 PM IST
Raashi Khanna Undiporaadhey Song :ఆ పాటతో నెటిజన్లను ఫిదా చేస్తున్న రాశీఖన్నా
X
Raashi Khanna

Raashi Khanna Undiporaadhey Song : నటుడు అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది అందాల తార రాశీఖన్నా.. చేసిన మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, నటిగా కూడా రాశీఖన్నాకి మంచి పేరు రావడంతో వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి. అందులో భాగంగా సుప్రీమ్, జై లవకుశ,తొలిప్రేమ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. కానీ ఆ తరవాత ఈ అమ్మడుకి వరుసగా ప్లాప్స్ వచ్చాయి.. ఇక గత ఏడాది వెంకీమామ, ప్రతిరోజూ పండగే చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి..

రాశీఖన్నా ఎంత మంచి హీరోయినో అంత మంచి గాయని కూడా.. ఆమె మొదటి సారిగా తానూ నటించిన 'జోరు' సినిమాలో టైటిల్ సాంగ్ పాడి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఇక ఆ తర్వాత 'బాలకృష్ణుడు' సినిమాలో మరో పాట పాడింది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'జవాన్' సినిమాలో ఓ పాటను పాడి ఆకట్టుకుంది ఈ భామ.. ప్రస్తుతం కరోనా వలన సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో ఇంట్లోనే ఉంటున్న రాశీ.. హుషారు చిత్రంలోని ఉండిపోరాదే.. అనే ఓ పాపులర్ పాడుతూ గిటార్ ను వాయిస్తూ అదరగొట్టింది. ఆమె పాటకి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


ఇక ప్రస్తుతం రాశీఖన్నా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రాశీ ఖన్నా రవితేజ సరసన 'బెంగాల్ టైగర్', 'టచ్ చేసి చూడు' వంటి చిత్రాలలో నటించింది. అంతేకాకుండా అజయ్‌ భూపతి తెరకెక్కిస్తున్న 'మహాసముద్రం' సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా ఎంపిక అయిందని సమాచారం..

Krishna

Krishna

Next Story