'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి పూజా లుక్ రిలీజ్!

Most Eligible Bachelor : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో పూజా హేగ్దే ఒకరు.. గత ఏడాది మహర్షి, ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రాలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్లను అందుకున్న ఈ భామ.. ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది.

Krishna
Published on: 13 Oct 2020 6:36 PM IST
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ నుంచి పూజా లుక్ రిలీజ్!
X

pooja hegde 

Most Eligible Bachelor : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో పూజా హేగ్దే ఒకరు.. గత ఏడాది మహర్షి, ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రాలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్లను అందుకున్న ఈ భామ.. ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపొయింది. ప్రస్తుతం పూజా హేగ్దే అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', ప్రభాస్ సరసన 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తోంది.

అయితే ఈ రోజు పూజా హేగ్దే పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆమె నటిస్తున్న సినిమాలో నుంచి ఆమె లుక్ ని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను సప్ రైజ్ చేశారు. అఖిల్ సరసన చేస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' చిత్రం నుంచి కొద్దిసేపటి క్రితం సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది టీం.. సినిమా నుంచి పూజా సోలో లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. స్టయిలిష్ గా వున్న పూజ కాలేజీకి వెళుతున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది.

బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమాని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై 'బన్నీ' వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

అటు ప్రభాస్ సరసన నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం నుంచి కూడా పూజా లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. కే. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.

Krishna

Krishna

Next Story