Krithi Shetty: చేతినిండా ఆఫర్లు ఉన్నా హిట్ మాత్రం కొట్టలేకపోతున్న హీరోయిన్

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది.

Arun Chilukuri
Updated on: 16 Sept 2022 1:00 PM IST
Heroine Krithi Shetty Lacking Hits Despite Huge Offers
X

Krithi Shetty: చేతినిండా ఆఫర్లు ఉన్నా హిట్ మాత్రం కొట్టలేకపోతున్న హీరోయిన్

Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగారాయి, బంగార్రాజు సినిమాలతో కూడా సూపర్ హిట్లు అందుకొని గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. కానీ "మాచర్ల నియోజకవర్గం", "ది వారియర్" వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా మారడంతో సడన్గా ఈమె ఐరన్ లెగ్ గా మారిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి.

"ది వారియర్" సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన ఈమె మొదటి సినిమాతోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇప్పుడు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" సినిమాతో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది ఈ భామ. 2021 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా కృతి శెట్టి ఆరు తెలుగు సినిమాలలో నటించింది. కానీ అందులో ఒక్క సినిమా కూడా కృతి శెట్టికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది.

ప్రస్తుతం ఈమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాగచైతన్య - వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కుతున్న తెలుగు తమిళ బైలింగ్విల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి తమిళ హీరో సూర్య - బాలా కాంబో లో రూపొందుతున్న చిత్రంలోనూ కనిపించనుంది. ఈ రెండు సినిమాలు ఈ బ్యూటీ కెరీర్ లో హిట్లుగా నిలుస్తాయో లేదో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story