Kavya Thapar: ముంబై పోలీసులకు దొరికిపోయిన హీరోయిన్

Kavya Thapar: ముంబై పోలీసులకు దొరికిపోయిన హీరోయిన్

admin1
Updated on: 21 Feb 2022 2:01 PM IST
Heroine Kavya Thapar Found by Mumbai Police | Tollywoodn News
X

ముంబై పోలీసులకు దొరికిపోయిన హీరోయిన్

Kavya Thapar: సంతోష్ శోభన్ హీరోగా నటించిన "ఏక్ మిని కథ" సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్య థాపర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. బాగా తాగి డ్రైవింగ్ చేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ ను కొట్టినట్లుగా ఆమెపై కేసు నమోదైంది. పోలీస్ ఆఫీసర్ కి బాగా దెబ్బలు తగిలి నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఫిబ్రవరి 17 గురువారం జరిగింది. ఆక్సిడెంట్ జరిగినప్పుడు కావ్యా తాగేసి ఉంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ ని బూతులు తిట్టడం కూడా ఆమెపై కంప్లైంట్ నమోదు చేశారు.

"నటి కావ్య ఆఫర్ ని అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీ కి పంపించాము. పోలీస్ ఆఫీసర్ తో బూతులు మాట్లాడటం, తాగి డ్రైవ్ చేయడం, యాక్సిడెంట్ చేయడం వంటి కేసులు ఈమెపై నమోదయ్యాయి" అంటూ పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ పోలీస్ కేసు విషయమై కావ్య ఇంకా రియాక్ట్ అవ్వాలి. యు వి క్రియేషన్స్ వారు నిర్మించిన "ఎక్ మినీ కథ" సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోనే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కావ్య థాపర్ తదుపరి ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువాడాల్సి ఉంది.

admin1

admin1

Next Story