చందమామ 'కాజల్' కు ప్రత్యేక శుభాకాంక్షలు పంపిన ఆడపడుచు..నెట్టింట్లో ఫోటోలు వైరల్!

చందమామ కాజల్ కు ప్రత్యేక శుభాకాంక్షలు పంపిన ఆడపడుచు..నెట్టింట్లో ఫోటోలు వైరల్!
x
Highlights

Kajal Aggarwal pre wedding photos : కాజల్ అగర్వాల్ పెళ్లి కుదిరింది అని ప్రకటించినప్పటి నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

త్వరలో పెల్లిపీటలు ఎక్కబోతున్నట్టు ప్రకటించిన చందమామ కాజల్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు.. బంధువులు.. సన్నిహితుల అభినందనలతో కాజల్ సోషల్ మీడియా ఎకౌంట్లు నిండిపోతున్నాయి. వీటిలో ఓ స్పెషల్ శుభాకాంక్షల సందేశం కూడా ఉంది. అది కాజల్ కాబోయే ఆడపడుచు చెప్పిన శుభాకాంక్షలు. కాజల్ కాబోయే భర్త గౌతమ్ కిచ్లు సోదరి గౌరు కుచ్లు నాయర్ కాజల్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ శుభాకాంక్షల సందేశంతో పాటు కాబోయే వధూవరులు కాజల్-గౌతమ్ లతో దిగిన ఫోటోను షేర్ చేశారు. దీంతో పాటు ''ప్రేమతో అభినందనలు'' అంటూ పోస్ట్ పెట్టారు. ఇంస్టా లో ఆమె పెట్టిన పోస్ట్ కు కాజల్ వెంటనే 'ధన్యవాదములు..సిస్టర్'' అంటూ సమాధానం ఇచ్చారు.

అంతేకాదు గౌరీ పంపిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టొరీ గా కాజల్ పెట్టుకున్నారు.; దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. కాజల్ ఈ ఫోటోలో తన కాబోయే భర్త గౌతమ్, ఆడపడుచు గౌరీల మధ్య కూచుని ఉన్నారు. ఈ ఫోటో కాజల్ అభిమానులకు తెగ నచ్చేసింది. వారు ఇన్‌స్టా వేదికగా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను ఈ నెల 30 వతేదీన ముంబైలో గౌతమ్ కిచ్లూను పెల్లిచేసుకోబోతున్నాను అని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ లో కాజల్ పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటె.. కాజల్ బ్యాచిలరేట్‌ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్‌ నెలాఖరున కాజల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్‌ కిచ్లు సోదరితోపాటు అతి తక్కువమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి.. 'బ్రైడ్‌ టు బి' క్యాప్షన్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

నిజానికి, ఈ ఫొటోలను కాజల్‌ సెప్టెంబర్‌ 28న ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ.. అవి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ పిక్స్‌ అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. త్వరలో తాను గౌతమ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్లు కాజల్‌ ప్రకటించడంతో ఆనాటి ఫొటోలు ఒక్కసారిగా నెట్టింట్లో వైరల్ గా మారిపోయాయి. కాజల్‌-గౌతమ్‌లకు శుభాకాంక్షలు చెబుతూ బ్యాచిలరేట్‌ పార్టీ ఫొటోలను.. ఆమె అభిమానులు పలు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వేదికగా షేర్‌ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories