Hansika Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ హన్సిక..వరుడు ఎవరో తెలుసా..?

Hansika Marriage: చైల్డ్ ఆర్టిస్ట్ గా కరియర్ ను మొదలుపెట్టి అల్లు అర్జున్ హీరోగా నటించిన "దేశముదురు" సినిమాతో హీరోయిన్ గా మారింది హన్సిక మోత్వాని.

Arun Chilukuri
Updated on: 4 Aug 2022 8:30 PM IST
Heroine Hansika Marriage News Go Viral
X

Hansika Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ హన్సిక..వరుడు ఎవరో తెలుసా..?

Hansika Marriage: చైల్డ్ ఆర్టిస్ట్ గా కరియర్ ను మొదలుపెట్టి అల్లు అర్జున్ హీరోగా నటించిన "దేశముదురు" సినిమాతో హీరోయిన్ గా మారింది హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ ఆ తరువాత కన్నడ, హిందీ, మరియు తమిళ భాషల్లో బిజీగా మారింది. ఈ మధ్యనే తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటించిన "తెనాలి రామకృష్ణ బీ ఏ బీ ఎల్" సినిమాలో నటించిన హన్సిక ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లోకి ఎక్కింది.

తాజా సమాచారం ప్రకారం ఈ భామ ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామరస్ పాత్రలు కూడా పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హన్సిక ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే త్వరలోనే హన్సిక పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతుందట. సౌత్ కి చెందిన ఒక బడా పొలిటిషన్ కుమారుడుతో హన్సిక వివాహం జరగబోతుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట.

అయితే హన్సికకు కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు, ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకుని వీరి నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత హన్సిక సినిమాలలో నటిస్తుందా లేదా అంటూ కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఈమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story