విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ ఖరారు

Ruthvik
Published on: 26 March 2019 5:33 PM IST
విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ ఖరారు
X

'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం', 'టాక్సీవాలా' వంటి వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటిదాకా తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. తనను హీరోగా పరిచయం చేసిన 'పెళ్లిచూపులు' చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముంబై మోడల్ అవంతిక మిశ్రా ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ఈమె ఇప్పటికే తెలుగులో 'మాయా', 'మీకు మీరే మాకు మేమే' వంటి ఒకటి రెండు చిత్రాల్లో నటించింది కానీ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకో లేకపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది అవంతిక. మరి ఈ సినిమాతో అయినా అవంతిక హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

Ruthvik

Ruthvik

Next Story