Digangana Suryavanshi: ఎమ్ బీ ఏ చేయబోతున్న కార్తికేయ హీరోయిన్

Digangana Suryavanshi: ఎమ్ బీ ఏ కి ఎన్రోల్ అయిన దిగంగన

admin1
Published on: 29 Nov 2021 4:27 PM IST
Heroine Digangana Suryavanshi Enrolls in MBA
X

హీరోయిన్ దిగంగా సూర్యవంశీ (ఫైల్ ఇమేజ్)

Digangana Suryavanshi: బాలీవుడ్ బ్యూటీ దిగంగన సూర్యవంశీ కార్తికేయ హీరోగా నటించిన "హిప్పీ" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. అయితే ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ భామ ఈ మధ్యనే గోపీచంద్ మరియు తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన "సీటీ మార్" సినిమాలో కనిపించింది. అయితే తాజాగా ఒకవైపు సినిమాలు మాత్రమే కాక మరోవైపు తన చదువుపై కూడా అంతే దృష్టి పెడుతూ ఉంది దిగంగన. ఈ మధ్యనే బిఏ కూడా పూర్తి చేసింది ఈ భామ.

అయితే నటనతో బిజీగా ఉండటంవల్ల మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ 5 ఏళ్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది దిగంగన. ఇక తాజాగా చదువు మీద మక్కువ తో ఎమ్ బీ ఏ లో ఎన్రోల్ చేసుకుంది ఈ బ్యూటీ. ఒక వైపు సినిమా కెరీర్ నే కాక చదువు ను కూడా అంతే బ్యాలెన్స్ చేస్తోంది దిగంగన. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం దిగంగన "బ్యాటిల్ ఆఫ్ భీమ కొరెగన్" అనే హై బడ్జెట్ హిస్టారికల్ సినిమాలో నటిస్తోంది. తెలుగులో కూడా మరొక సినిమా సైన్ చేసింది ఈ భామ.

admin1

admin1

Next Story