Anu Emmanuel: కేవలం అందంతో అను ఇమాన్యుల్ హిట్ అందుకుంటుందా?

Anu Emmanuel: కేవలం అందంతో అను ఇమాన్యుల్ హిట్ అందుకుంటుందా?

Rama Rao
Published on: 3 Nov 2022 8:55 AM IST
Heroine Anu Emmanuel is Waiting for a Hit | Tollywood News
X

Anu Emmanuel: కేవలం అందంతో అను ఇమాన్యుల్ హిట్ అందుకుంటుందా?

Anu Emmanuel: కొన్ని కొన్ని సార్లు సినిమా హిట్ అయినా ఫ్లాపైనా పెద్ద స్టార్ హీరోలతో నటిస్తే ఆ హీరోయిన్లకు కూడా మంచి పేరు వస్తుంది. "మజ్ను" సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మలయాళం బ్యూటీ అను ఇమాన్యుల్ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు బాగానే ప్రయత్నాలు చేసింది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి పెద్ద పెద్ద స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ఈమెకు కూడా అంత క్రేజ్ రాలేదు.

తాజాగా కొన్నాళ్లు తెలుగు సినిమాలకి దూరంగా ఉన్న అను ఇమాన్యుల్ తాజాగా ఇప్పుడు "ఊర్వశివో రాక్షసివో" అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె హాట్ గ్లామరస్ అవతారంలో కనిపించబోతోంది.ఇక ఆమె కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు, రొమాంటిక్ సన్నిదేశాలలో కూడా నటించిందని సినిమా ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. సినిమా నుంచి తన అదిరిపోయే లుక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కానీ కేవలం ఆమె అందం సినిమాని హిట్ చేయగలదా అని ఇంకా వేచి చూడాలి. డైరెక్టర్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మరి డైరెక్టర్ కేవలం హీరోయిన్ అందం పైన ఫోకస్ చేశారా లేక కంటెంట్ కూడా ఉందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ శుక్రవారం అనగా నవంబర్ 4 న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అను ఇమాన్యుల్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించగలదో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story