Dasara: నాని దసరా లో "అఖండ" భామ

Dasara: నాని దసరా లో "అఖండ" భామ

Rama Rao
Updated on: 20 July 2022 4:30 PM IST
Heroin Poorna Villan Role in Nani Dasara Movie | Tollywood News
X

నాని దసరా లో "అఖండ" భామ 

Dasara Movie: ఈ మధ్యనే "అంటే సుందరానికి" సినిమాతో మంచి హిట్ ను అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన తదుపరి సినిమా "దసరా" తో బిజీగా ఉన్నారు. బొగ్గు గని బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. అయితే నాని కెరీర్లో పెద్ద బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. "నేను లోకల్" సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది.

ఈ మధ్యనే "అఖండ" సినిమాలో కీలక పాత్ర పోషించిన పూర్ణ ఇప్పుడు "దసరా" సినిమాలో ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈమె ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. పూర్ణ పాత్ర చాలా భయంకరంగా మరియు ఈవిల్ గా ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె పాత్ర గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయికుమార్, సముద్రకని, జరీనా వాహబ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story