Pooja Hegde: స్టార్ బ్యూటీ పూజ హెగ్డే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Pooja Hegde: రెమ్యూనరేషన్ తో షాక్ ఇస్తున్న పూజా హెగ్డే

admin1
Updated on: 18 Oct 2021 10:46 PM IST
Heroin Pooja Hegde Takes Highest Remuneration in Tollywood
X
హీరోయిన్ పూజ హెగ్డే (ఫోటో ది హన్స్ ఇండియా)

Pooja Hegde: "డీ జే" సినిమాతో హాట్ బ్యూటీ పూజా హెగ్డే దశ తిరిగింది అనే చేపుకోవచ్చు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ మధ్యనే "అల వైకుంఠపురం లో" సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టాలీవుడ్ మరియు బాలీవుడ్ లో పూజా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటోంది. వరుసగా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్న పూజా తమిళ్ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న "బీస్ట్" సినిమా కు అందుకున్న భారీగా పారితోషికం తీసుకోబోతోందట.

పూజా హెగ్డే ఒక్కో సినిమా కోసం మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. మరోవైపు యాడ్స్ ద్వారా నెలకి కనీసం 50 లక్షలకు పైగానే సంపాదిస్తోంది పూజ. ఇలా ఒక వైపు సినిమాలు మరో వైపు యాడ్స్ అంటూ పూజ హెగ్డే రెండు చేతుల బాగానే సంపాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని బాంద్రాలో ఒక పెద్ద 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ని కోట్లు పెట్టి మరి కొన్ని సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా "రాధే శ్యామ్", "ఆచార్య", మహేష్ బాబు-త్రివిక్రమ్ వంటి పెద్ద సినిమాలతో బిజీగా ఉంది పూజ హెగ్డే.

admin1

admin1

Next Story