దిల్ రాజు డిమాండ్లతో షాక్ అయిన హీరోలు మరియు డైరెక్టర్లు

Dil Raju: ప్రస్తుతం తెలుగు నిర్మాతల కౌన్సిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 1 Aug 2022 8:00 PM IST
Heroes and Directors are Shocked by Dil Rajus Demands
X

దిల్ రాజు డిమాండ్లతో షాక్ అయిన హీరోలు మరియు డైరెక్టర్లు

Dil Raju: ప్రస్తుతం తెలుగు నిర్మాతల కౌన్సిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నిర్మాతలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా షూటింగులన్నిటికీ బ్రేకులు పడ్డాయి. హీరోలు మరియు డైరెక్టర్లు ఎట్టి పరిస్థితుల లోనూ తమ రెమ్యూనరేషన్ లు తగ్గించుకోవాల్సిందే అంటూ నిర్మాతల కౌన్సిల్ తరఫునుంచి దిల్ రాజు డిమాండ్ చేస్తున్నారు.

కానీ హీరోలు మరియు డైరెక్టర్లు మాత్రం ఈ డిమాండ్ కి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. తమ వల్లనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని ఆ మాత్రం రెమ్యూనరేషన్ ఉండాల్సిందేనని డైరెక్టర్లు మరియు హీరోల వాదన. తాజాగా దిల్ రాజు నిర్మించిన "ఎఫ్ 3" మరియు "థాంక్యూ" సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి. బాలీవుడ్ లో కూడా "జెర్సీ" సినిమా రీమేక్ ని నిర్మించిన దిల్ రాజు అక్కడ కూడా మంచి ఫలితాన్ని అందుకోలేక పోయారు.

అయితే మరోవైపు హీరోలు మరియు డైరెక్టర్లు మాత్రమే కాక కొంతమంది నిర్మాతలు కూడా దిల్ రాజు డిమాండ్లతో ఏకీభవించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో షూటింగులు వాయిదా పడితే మరింత ఇబ్బందులు కలుగుతాయని వారి ఆరోపణ. అశ్వినీ దత్, బండ్ల గణేష్ వంటి నిర్మాతలు ఇప్పటికే దిల్ రాజుకి వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. "దిల్ రాజు రూల్స్ తో మేము ఏకీభవించడం లేదు. మేము మా షూటింగ్ ని కొనసాగిస్తున్నాము" అని అశ్వినీదత్ ఇప్పటికే ప్రకటించేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story