Vishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్‌ ఇస్తున్న విశ్వక్‌ సేన్‌

Vishwak Sen: ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువహీరో విశ్వక్ సేన్..

Arun Chilukuri
Updated on: 21 May 2022 9:00 PM IST
Hero Vishwak Sen Hikes his Remuneration
X

Vishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్‌ ఇస్తున్న విశ్వక్‌ సేన్‌

Vishwak Sen: ఫలక్నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న యువహీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "పాగల్" అనే సినిమాతో పర్వాలేదు అనిపించారు. తాజాగా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విశ్వక్. టీజర్ మరియు ట్రైలర్ లతోనే ఆకట్టుకున్న ఈ సినిమా మే 6న థియేటర్లలో విడుదలైంది. రుక్సార్ ధిల్లాన్ మరియు రితిక నాయక్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వక్ మాత్రం నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

"అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమా కి ముందు వరకు విశ్వక్ సేన్ ఒక సినిమా కోసం 1.5 నుంచి రెండు కోట్ల దాకా పారితోషికాన్ని తీసుకునేవారు. కానీ తాజా సమాచారం ప్రకారం విశ్వక్ తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచేశాడట. కొత్త ప్రాజెక్టుల కోసం విశ్వక్ దగ్గరికి వెళ్లిన నిర్మాతలకి విశ్వక్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారట. విశ్వక్ అడిగే రెమ్యూనరేషన్ విని నిర్మాతలకు మతిపోతోందట. ఒక సినిమా కోసం విశ్వక్ సేన్ ఏకంగా మూడు కోట్ల రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం విశ్వక్ ఏ మాత్రం తగ్గటం లేదని మూడు కోట్ల కి ఓకే అయితే సినిమాలకి గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story