Vishal: ఇల్లు వచ్చే ఏడాది కొనుకోవచ్చు.. పునీత్ బాధ్యత తీర్చాలనుకుంటున్నా..

Vishal: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 3 Nov 2021 12:20 PM IST
Vishal: ఇల్లు వచ్చే ఏడాది కొనుకోవచ్చు.. పునీత్ బాధ్యత తీర్చాలనుకుంటున్నా..
X

Vishal: ఇల్లు వచ్చే ఏడాది కొనుకోవచ్చు.. పునీత్ బాధ్యత తీర్చాలనుకుంటున్నా..

Vishal: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా, ప్రముఖ హీరో విశాల్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వాదం పలుకగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మా సినిమా కుటుంబ సభ్యుడైన పునీత్ ను కోల్పోవడం బాధగా ఉందన్నారు హీరో విశాల్. పునీత్‌ సంకల్పం ఆగి పోకూడదని కోరుకున్నానని తెలిపారాయన. పునీత్ చదివిస్తున్న వారిని తాను చదివిస్తానని, తాను మరో ఇల్లు కొనుకోవాలని అనుకున్న కానీ.. ఇల్లు వచ్చే ఏడాది అయినా కొనుకోవచ్చు, పునీత్ బాధ్యత తీర్చాలని సంకల్పించినట్లు విశాల్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story