ఆ వార్తలు అవాస్తవం : నటుడు విశాల్

Arun Chilukuri
Published on: 14 Sept 2020 11:58 AM IST
ఆ వార్తలు అవాస్తవం : నటుడు విశాల్
X

తమిళ నటుడు విశాల్‌ బీజేపీలోకి చేరడానికి సిద్ధమవుతున్నట్లు, అందుకుగానూ ఆయన రాష్ట్ర ఆ పార్టీ అధ్యక్షుడు మురుగన్‌తో భేటీకి అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై నటుడు విశాల్ స్పందించాడు. గతంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ కూడా దాఖలు చేసిన విశాల్ చివరి క్షణంలో తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. తాజాగా, ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సిద్ధమవుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో విశాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ అపాయింట్‌మెంట్‌ను కోరాడని ఇటు ప్రధాన మీడియాతోపాటు అటు సోషల్ మీడియాలోనూ వార్తలు హోరెత్తాయి. ఈనేపథ్యంలో ఈయన త్వరలో బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే తను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విశాల్‌ కొట్టిపారేశారు. విశాల్ ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నాడు. అంతేకాదు, బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story