Hero Vishal Tests Positive For Coronavirus: అవును.. నాకు క‌రోనా వైర‌స్ సోకింది నిజ‌మే : హీరో విశాల్

Arun Chilukuri
Published on: 26 July 2020 12:40 PM IST
Hero Vishal Tests Positive For Coronavirus: అవును.. నాకు క‌రోనా వైర‌స్ సోకింది నిజ‌మే : హీరో విశాల్
X

hero vishal tests positive for coronavirus: కరోనా మహమ్మారి ఏ ఒక్కరినీ వదలడం లేదు. భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డారు. తాజాగా హీరో విశాల్‌ కూడా కరోనా బారిన పడ్డారు. విశాల్ తో పాటు అత‌ని తండ్రి కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విశాల్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

కరోనా పరీక్షల్లో మా నాన్న (జీకే రెడ్డి)కు పాజిటివ్‌ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డాను. నా మేనేజర్‌కు కూడా ఇవే లక్షణాలు ఉన్నాయి. మేమంతా ఆయుర్వేద ఔషధాలు వాడి కేవలం వారం రోజుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా'' అని విశాల్‌ ట్వీట్‌ చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story