Vikram: కథల విషయంలో పట్టు కోల్పోయిన హీరో విక్రమ్

Vikram: ట్రెండ్ కు తగ్గట్టుగా మారలేకపోతున్నహీరో విక్రమ్

admin1
Updated on: 10 Feb 2022 10:00 PM IST
Hero Vikram is Unable to Adapt to the Trend | Tollywood News
X

Vikram: ట్రెండ్ కు తగ్గట్టుగా మారలేకపోతున్న హీరో విక్రమ్

Vikram: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు కూడా మంచి కథలు ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రెండ్ తో పాటు వారు కూడా తమ స్టోరీ సెలక్షన్ విషయంలో బాగానే కొత్తదనం తీసుకు రావడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా అవే పాత కథలను ఎంచుకుంటూ వరుసగా డిజాస్టర్ లు అందుకుంటున్న సీనియర్ హీరోలు కూడా ఉన్నారు. అందులో ఒకరే కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఒకప్పుడు విక్రమ్ సినిమా అంటే చాలు అభిమానులు థియేటర్ల ముందు క్యూ కట్టే వాళ్ళు. ఎందుకంటే విక్రమ్ స్టోరీ సెలెక్షన్ అలా ఉండేది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు చాలా వరకు దూరంగా ఉండే విక్రమ్ ఏదో ఒక కొత్తదనం ఉండే సినిమాలను మాత్రమే ఎంచుకునే వాళ్ళు.

అలా విడుదలైన సినిమాలు అపరిచితుడు, ఐ తదితర సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా మారాయి. కానీ చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో విక్రమ్ స్టోరీ సెలక్షన్ ఏమాత్రం బాగుండటం లేదు. ఇదివరకు ఉన్న క్రేజ్ విక్రమ్ సినిమాలకి ఇప్పుడు లేదు. దానికి కారణం విక్రమ్ ఎంచుకుంటున్న కథలు ఈ మధ్యనే విక్రమ్ హీరోగా నటించిన మహాన్ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకోలేకపోయింది. కార్తీక్ సుబ్బరాజు వంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. దీంతో ఇది వరకు విక్రమ్ కి కథలపై ఉండే పట్టు ఇప్పుడు పోయింది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇకనైనా తన సినిమాల విషయంలో విక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటారా లేక మళ్లీ అవే కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story