Vaarasudu: దిల్ రాజు వారసుడిని పరిచయం చేసిన విజయ్..!

Hero Vijay With Dil Rajus Son
x

Vaarasudu: దిల్ రాజు వారసుడిని పరిచయం చేసిన విజయ్..!

Highlights

Vaarasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Vaarasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "వారసుడు" అనే టైటిల్తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తెలుగులో విజయ్ కి ఇది మొదటి సినిమా కాగా వంశీ పైడిపల్లి కి ఇది తమిళ్ లో మొదటి సినిమా. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. షూటింగ్ గ్యాప్‌లో నిర్మాత దిల్ రాజు ఇంటికి వెళ్లిన విజయ్.. ఆయన వారసుడిని ఎత్తుకుని కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూసిన వారంతా.. దిల్ రాజు 'వారసుడు'ని విజయ్ పరిచయం చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories