Vamshi Paidipally - Vijay: వంశీ పైడిపల్లి సినిమాలో విజయ్ పొషించనున్న పాత్ర ఇదేనా

* సరికొత్త పాత్రలో కనిపించనున్న విజయ్

admin1
Updated on: 20 Nov 2021 3:31 PM IST
Hero Vijay Playing Role With Erotomania Disease in Vamshi Paidipally Movie
X

సరికొత్త పాత్రలో కనిపించనున్న విజయ్ (ఫైల్ ఫోటో)

Vamshi Paidipally - Vijay: తెలుగు సినిమాలను తమిళ్ లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ లు అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. ఇప్పుడు విజయ్ కోసం తెలుగు నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా కేవలం తమిళ్ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసిన విజయ్ త్వరలో స్ట్రెయిట్ తెలుగు సినిమానే చేయబోతున్నాడు. "వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్వల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమా గురించిన ఒక ఆస్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో విజయ్ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడట.

సినిమాలో విజయ్ పాత్రకి ఎరొటోమేనియా అనే మానసిక సమస్య ఉంటుందట. ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక భ్రమలో ఉంటారు. నచ్చిన వ్యక్తి తమని ప్రేమిస్తున్నట్టు అపోహ పడుతుంటారు. అసలు ఆ వ్యక్తిగా వీరెవరో తెలియకపోయినా, వాళ్ళు మాత్రం ప్రేమించుకుంటున్నట్టు ఫీలవుతారు. అలాంటి పాత్రలోనే విజయ్ కనిపిస్తాడట. ఇప్పటికే పలు మారుతి సినిమాల్లో హీరోలు అలాంటి పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. చూస్తుంటే వంశీ కూడా అలాంటి కథే రాశాడని సమాచారం. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

admin1

admin1

Next Story