వెంకీ.. మీ సపోర్టును మిస్ అవుతున్నాం : SRH

Venkatesh Wished To SRH : స్టార్ హీరో వెంకటేష్ కి సినిమాలతో పాటుగా క్రికెట్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే.. ఇక ఐపీఎల్ లో సన్ రైజర్స్

Krishna
Published on: 21 Sept 2020 12:32 PM IST
వెంకీ.. మీ సపోర్టును మిస్ అవుతున్నాం :  SRH
X

Venkatesh 

Venkatesh Wish To SRH : స్టార్ హీరో వెంకటేష్ కి సినిమాలతో పాటుగా క్రికెట్ అంటే పిచ్చి అన్న సంగతి తెలిసిందే.. ఇక ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటే హీరో వెంకటేశ్ కచ్చితంగా స్టేడియానికి వెళ్తాడు.. అక్కడ ఈలలు వేస్తూ తన నుంచి హైదరాబాదు టీంకి మంచి సపోర్ట్ ఇస్తాడు వెంకీ.. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఐపీఎల్ దుబాయ్‌లో జరుగుతుండగా వెంకీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది..

ఈ క్రమంలో సన్ రైజర్స్ టీంను సపోర్ట్ చేస్తూ వెంకటేశ్ ఓ ట్వీట్ చేశాడు. 'ఆల్‌ దిబెస్ట్ SRH... నేను మిమ్మల్ని ఇంట్లోనే ఉండి ఉత్సాహపరుస్తాను' అని వెంకీ పోస్ట్ చేశాడు.. అయితే వెంకీ ట్వీట్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ స్పందిస్తూ.. 'స్టేడియం స్టాండ్స్ నుంచి మీ సపోర్టును మిస్ అవుతాం' అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది..

ఇక ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తన మొదటి మ్యాచ్ ని ఆడబోతుంది.. ఇటు జట్లు కూడా మంచి బ్యాటింగ్ లైనప్, బలమైన బౌలర్లతో సమానంగా ఉన్నాయి.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ 07 : 30 కి మొదలుకానుంది. ఇక ఇప్పటికి సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు చాంఫియ‌న్‌గా నిలవగా, 2009, 2016 లో ఫైనల్‌కు చేరి రన్నరప్ తో సరిపెట్టుకుంది.

Krishna

Krishna

Next Story