Venkatesh New Movie: నయన్‌తో మరోసారి రొమాన్స్ చేయనున్న వెంకీ మామ?

Venkatesh New Movie: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, క్రేజీ డైరెక్టర్‌ త్రివిక్రమ్ తో జత కట్టేందుకు రెడీ అయ్యాడు.

Venkata Chari
Published on: 19 May 2021 4:40 PM IST
Hero Venkatesh will Act With Nayanthara in his New Movie
X

వెంకటేష్, నయనతార (ఫొటో ట్విట్టర్)

Venkatesh New Movie: సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, క్రేజీ డైరెక్టర్‌ త్రివిక్రమ్ తో జత కట్టేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబో లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరీ' సూపర్ హిట్‌లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రెండు సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేశారు. వెంకటేష్ కెరీర్‌లో 75 వ సినిమాకి మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

తాజా నివేదికల ప్రకారం, బౌండెడ్ స్క్రిప్ట్‌ ను ఓకే చేసిన వెంకీ మామ.. పూర్తి కథను పూర్తిచేయమని కోరాడంట. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించనుందనే వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష, నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం నయనతార వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

నయన్, వెంకటేష్ మరోసారి రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యారన్నమాట. గతంలో వీరి కాంబోలో వచ్చిన లక్ష్మి, బాబు బంగారం, తులసి సినిమాల్లో ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నయన్ హీరోయిన్‌గా ఓకే అయితే, నాలుగో సారి ఈ జోడీ సందడి చేయనున్నట్లే.

మరోవైపు, వెంకటేష్ తమిళ సూపర్ హిట్ చిత్రం 'అసురన్' ను తెలుగులో 'నారప్ప' టైటిల్ తో రీమేక్ చేయబోతున్నాడు. అలాగే 'ఎఫ్ 2 ' సీక్వెల్ లో ఎఫ్‌ 3 లో కూడా నటిస్తున్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story