Venkatesh: మళ్లీ రీమేక్ సినిమా అంటున్న వెంకటేష్

Venkatesh: మరొక రీమేక్ సినిమాతో వెంకీ

admin1
Published on: 4 Dec 2021 2:42 PM IST
Hero Venkatesh Going to be Remake the Driving Licence Movie
X

మలయాళంలో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్న వెంకటేష్ (ఫైల్ ఇమేజ్)

Venkatesh: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో వరసపెట్టి రీమేక్ ల ట్రెండ్ నడిపిస్తున్న హీరో విక్టరీ వెంకటేష్. ఒక భాషలో హిట్ అయిన సినిమాని మన తెలుగు భాషలో రీమేక్ చేసి విజయాలను అందుకుంటున్నారు వెంకీ. ఇప్పటివరకు తెలుగులో చాలా రీమేక్ చిత్రాల్లో న‌టించి మంచి హిట్లను సైతం అందుకున్నారు వెంకీ. రీమేక్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయారు అనటంలో కూడా అతిశయోక్తి లేదు. త‌మిళంలో హిట్ అయిన "అసూరన్" ని తెలుగులో నారప్ప గా ఓటీటీలో రిలీజ్ చేశారు.

తాజాగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన దృశ్యం సినిమాకు సిక్వెల్ గా దృశ్యం 2 అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు వెంకీ మరో రీమేక్ పై క‌న్నేశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోన్న‌ట్టు తెలుస్తోంది. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా మల‌యాళంలో భారీ విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్ర రీమేక్ లో వెంకీ, రానా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్ ను సురేష్ ప్రొడక్షన్స్ వారు తీసుకున్నారట.

admin1

admin1

Next Story