Nani: నాని కి పోటీగా క్రిస్మస్ బరిలో దిగిన మెగా హీరో

Nani: నాని కి షాక్ ఇచ్చిన మెగా హీరో

admin1
Updated on: 16 Nov 2021 3:11 PM IST
Hero Varun Tej Going to Be Release Gani Movie on December 17th
X
నానికి పోటీగా సంక్రాంతి బరిలో దిగనున్న మెగా హీరో (ఫైల్ ఇమేజ్)

Nani: నాచురల్ స్టార్ నాని ఈ మధ్యన "టక్ జగదీష్" సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తన తదుపరి సినిమా అయినా "శ్యామ్ సింగరాయ్" ను సోలో గా విడుదల చేయాలని అందరికంటే ముందుగానే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. అప్పటికే "పుష్ప" సినిమా విడుదల అయ్యి వారం అవుతుంది కాబట్టి కలెక్షన్ల పరంగా ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బంది రాదు అని దర్శక నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు నాని కి పోటీగా మెగా హీరో తన సినిమాతో ముందుకు రాబోతున్నాడు.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన "గని" సినిమా చాలా సార్లు వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం టీజర్ ని విడుదల చేస్తూ సినిమా డిసెంబర్ 24న విడుదల కాబోతోంది అని ప్రకటించారు దర్శక నిర్మాతలు. మరోవైపు అదే రోజున విడుదల చేద్దామనుకున్న నాని ఇప్పటికే ప్రమోషన్లో పనిలో బిజీ అయ్యాడు. అసలే "వీ", "టక్ జగదీష్" తో ఫ్లాపులు చవిచూసిన నాని తన ఆశలన్నీ "శ్యామ్ సింగరాయి" సినిమాపైనే పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ నాని కి పోటీగా తన సినిమాని విడుదల చేయబోతున్నాడు. దీంతో నాని కి పెద్ద షాక్ తగిలింది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి అంటే కచ్చితంగా కలెక్షన్లు షేర్ అవుతాయని చెప్పుకోవాలి. మరి నాని ఈ సినిమాతో ప్రేక్షకులని ఎంతవరకూ ఆకట్టుకుంటాడో వేచిచూడాల్సిందే.

admin1

admin1

Next Story