Vaishnav Tej Second Movie : అప్పుడే రెండో సినిమాని మొదలు పెట్టేశాడు

Vaishnav Tej Second Movie : మెగా ఫ్యామిలీ నుంచి ఉప్పెన సినిమాతో వెండితెరకి పరిచయం అవుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

Krishna
Published on: 15 Aug 2020 3:31 PM IST
Vaishnav Tej Second Movie : అప్పుడే రెండో సినిమాని మొదలు పెట్టేశాడు
X
Rakul preet singh , vaishnav tej (File Photo)

Vaishnav Tej Second Movie : మెగా ఫ్యామిలీ నుంచి ఉప్పెన సినిమాతో వెండితెరకి పరిచయం అవుతున్నాడు హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి కొత్తేమికాదు.. చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీయస్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు ఉప్పెన సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నిత్యా శెట్టి అనే కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సాంగ్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేశాయి.

దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన విడుదలకి వాయిదా పడింది. ఇక ఇది ఇలా ఉండగానే మరో సినిమాని మొదలు పెట్టాడు వైష్ణవ్ తేజ్.. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తన రెండో సినిమాని మొదలు పెట్టాడు వైష్ణవ తేజ్.. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది.. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈరోజు (శనివారం ఆగస్టు 15) నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలువుతుంది. అయితే ఈ సినిమాని సింగిల్‌ షెడ్యూల్‌లోకంప్లీట్ చేసేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.. జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫీ అందిస్తున్నారు..

ఇక అటు క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీనితో క్రిష్ సినిమా మొదలవ్వడానికి టైం పడుతుండడంతో ఈ టైంలో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాని మొదలు పెట్టాడు క్రిష్.. ఈ సినిమా తర్వాత పవన్ తో సినిమాని చేయనున్నాడు క్రిష్..

Krishna

Krishna

Next Story