మళ్ళీ తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్ వార్తలు

ఇప్పటికే ఉదయ్ కిరణ్ పై బయోపిక్ తీయాలని దర్శకుడు తేజ భావించారు. కానీ ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశారు.

Krishna
Updated on: 25 Nov 2019 4:27 PM IST
uday kiran
X
uday kiran

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తుంది. అందులో భాగంగానే మహానటి సావిత్రి, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర సినిమాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు మరో హీరో బయోపిక్ తెరపైకి వస్తునట్టు తెలుస్తుంది. చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఉదయ్ కిరణ్ జీవితాన్ని తెరపైకి తీసుకురావాలని కొందరు దర్శకనిర్మాతలు భావిస్తునట్టు సమాచారం..

ఇప్పటికే ఉదయ్ కిరణ్ పై బయోపిక్ తీయాలని దర్శకుడు తేజ భావించారు. కానీ ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు అతనిపైన బయోపిక్ ని తెరకెక్కించి డబ్బులు వేనుకేసుకోవాలా ? అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తేజ . ఆ తర్వాత ఈ బయోపిక్ పై ఎలాంటి అప్డేట్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఉదయ్ కిరణ్ బయోపిక్ ని తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిని ఓ కొత్త దర్శకుడు తెరకేక్కిస్తారని, ఇందులో ఉదయ్ కిరణ్ గా సందీప్ కిషన్ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపైన అధికార ప్రకటన లేదు.

ఇక ఉదయ్ కిరణ్ విషయానికి వస్తే.. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వరుస సినిమాలతో హిట్టు కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఈ నేపద్యంలో ఉదయ్ 2014 జనవరి 5 న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు.

Krishna

Krishna

Next Story