పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. కలసి వస్తుందా ?

Roshan Meka: టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి.

Arun Chilukuri
Updated on: 15 March 2022 6:31 PM IST
Hero Srikanth Son Changed his Name
X

పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. కలసి వస్తుందా ?

Roshan Meka: టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. తమ పేరుతో ఏవైనా సినిమాలు సరిగ్గా ఆడకపోతే న్యూమరాలజీ ప్రకారం తమ పేరుని మార్చుకొని సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు మరియు హీరోయిన్లు తమ పేరు లో ఎక్స్‌ట్రా అక్షరాలను యాడ్ చేసుకుని ఇండస్ట్రీలో మంచి స్థాయికి ఎదిగారు. తాజాగా ఈ జాబితాలో చేరారు రోషన్. ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడిగా నిర్మలా కాన్వెంట్ అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన రోషన్ (Roshan) మొదటి సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయాడు.

కొంతకాలం గ్యాప్ తీసుకున్నాక రోషన్ ఇప్పుడు పెళ్లి సందడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కలెక్షన్ల పరంగా సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రోషన్ తాజాగా ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం తన పేరులో ఎక్స్‌ట్రా ఎన్ అక్షరాన్ని జోడించాడు (Roshann). సాయి ధరంతేజ్, వైష్ణవ్ తేజ్, తమన్నా ఇలా చాలా మంది సెలబ్రిటీలు తమ పేర్లకు కొత్త అక్షరాలను జోడించి మంచి హిట్లు అందుకున్నారు. మరి రోషన్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించగలడో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story