Pelli SandaD Movie: రోషన్ పెళ్లి సందడి సినిమా గురించి శ్రీకాంత్ ఏమన్నారంటే..

* అప్పుడే సినిమాలు వద్దనుకున్నాం అని అంటున్న శ్రీకాంత్

admin1
Updated on: 2 Oct 2021 8:30 PM IST
Hero Srikanth Says About Roshann Pelli SandaD Movie
X

పెళ్లి సందడి (ట్విట్టర్ ఫోటో)

Pelli SandaD Movie: 1996 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి మరియు దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా నటించి బ్లాక్ బస్టర్ అయిన సినిమా "పెళ్లి సందడి". దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోంది. ఇందులో హీరో మరెవరో కాదు శ్రీకాంత్ తనయుడు రోషన్. "నిర్మలా కాన్వెంట్" సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రోషన్ మళ్లీ చాలా కాలం తర్వాత వెండితెరపై హీరోగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవక్షణ వహించడం మాత్రమే కాక ఒక క్యమియో పాత్రలో కూడా కనిపించటం విశేషం.

తాజాగా సినిమా గురించి మాట్లాడుతూ శ్రీకాంత్ తన సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ లో తన కొడుకు నటించటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నిజానికి రోషన్ ని మరొక రెండు మూడు ఏళ్ల పాటు సినిమాకి దూరంగా ఉంచాలని అనుకున్నారట. కానీ డిప్లమా పూర్తయిన వెంటనే రోషన్ ఎక్స్పీరియన్స్ కోసమని ప్రభుదేవాతో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "దబాంగ్ త్రీ" సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడట. గౌరి రోణంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మించారు. ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 15న విడుద‌ల కాబోతుంది.

admin1

admin1

Next Story