Akhanda: "అఖండ" సినిమాలో తన పాత్ర గురించి చెప్తున్న శ్రీకాంత్

Akhanda: "నా రోల్ పవర్ ఫుల్ గా ఉండాలని అన్నారు" అంటున్న శ్రీకాంత్

admin1
Published on: 27 Nov 2021 11:22 AM IST
Hero Srikanth Says About His Role in Akhanda Movie
X

అఖండ సినిమాలో తన పాత్ర గురించి చెప్పిన శ్రీకాంత్ (ఫైల్ ఇమేజ్)

Akhanda: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శ్రీకాంత్. బాలకృష్ణ తో పనిచేయడం తనకి ఎలా అనిపించింది అని అడగగా, కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్.

శ్రీరామరాజ్యం సినిమా తర్వాత మళ్లీ శ్రీకాంత్ బాలకృష్ణతో నటించిన రెండవ సినిమా ఇది. "ఈ సినిమాలో నేను బాలకృష్ణ సోదరుడి పాత్రలో కనిపించబోతున్నాను. నాది ఒక సాఫ్ట్ రోల్. కానీ నా పాత్ర రావణాసురుడి పాత్ర లాగా ఉండబోతోంది. సినిమాలోని ఒక యాక్షన్ సన్నివేశం కోసం మట్టిలో ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు పని చేయాల్సి వచ్చింది. కానీ బాలకృష్ణ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నా పాత్ర కూడా స్ట్రాంగ్ గా ఉండేలా చూడమని బోయపాటికి చెప్పారు" అన్నారు శ్రీకాంత్.

admin1

admin1

Next Story