Srikanth: జగపతి బాబు రూట్లో వెళుతున్న శ్రీకాంత్

Srikanth: సూపర్ హిట్ కాంబినేషన్ తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీకాంత్

admin1
Published on: 17 Nov 2021 11:38 AM IST
https://www.hmtvlive.com/tags/srikanth
X

జగపతిబాబు రూట్లో వెళుతున్న శ్రీకాంత్ (ఫైల్ ఇమేజ్)

Srikanth: హీరో గా ఆఫర్ లు తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నిలదొక్కుకోలేక ఇండస్ట్రీకి దూరమై పోతున్న సమయంలో "లెజెండ్" సినిమా జగపతి బాబు కి ఒక వరంలా మారింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత మళ్లీ జగపతిబాబుకి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఏర్పడలేదు. వరుస ఆఫర్లతో సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా మొదలుపెట్టారు జగపతిబాబు. జగపతి బాబు విషయంలో బాలయ్య బోయపాటి సినిమా ఎంత బాగా వర్కౌట్ అయిందో శ్రీకాంత్ విషయంలో కూడా అంతే బాగా వర్కౌట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "అఖండ". ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఒకప్పుడు హీరోగా మంచి సినిమాలను అందించిన శ్రీకాంత్ గత కొంత కాలంగా అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపిస్తున్నారు. క్యారెక్టర్ పాత్రలు కూడా శ్రీకాంత్ కి మంచివి పడలేదు. అందుకే ఈ సారి బాలయ్య బోయపాటి సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారు శ్రీకాంత్. మరి ఈ సినిమా శ్రీకాంత్ కెరియర్ కి ఎంత వరకు ఉపయోగపడుతుంది? జగపతి బాబు లాగానే శ్రీకాంత్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ గా బిజీ అవుతారా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

admin1

admin1

Next Story