Siddharth: సిద్ధార్థ్ లండన్ వెళ్ళింది సర్జరీ కోసమేనా?

Siddharth went to London for Surgery
x

Siddharth:సర్జరీ కోసం లండన్ వెళ్ళిన సిద్ధార్థ్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

* ఒక చిన్న సర్జరీ పనిమీద సిద్ధార్థ్ లండన్ వెళ్లారని అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రాలేకపోయినట్లు అజయ్ భూపతి చెప్పారు

Siddharth: "బొమ్మరిల్లు" సినిమా తో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఈ మధ్యనే "గృహం" అనే సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా సిద్ధార్థ్ "ఆర్ ఎక్స్ 100" డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న "మహా సముద్రం" సినిమాలో శర్వానంద్ తో పాటు కలిసి నటిస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం సిద్ధార్థ్ ఒక చిన్న సర్జరీ కోసం లండన్ వెళ్లబోతున్నారట. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు సిద్ధార్థ్. మీడియా తో మాట్లాడుతూ "మహా సముద్రం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ భూపతి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఒక చిన్న సర్జరీ పనిమీద సిద్ధార్థ్ లండన్ వెళ్లారని, అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రాలేకపోయినట్లు అజయ్ భూపతి చెప్పారు. కానీ ఆ సర్జరీ ఎందుకు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒక అద్భుతమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "మహాసముద్రం" సినిమాలో అదితి రావు హైదరి మరియు అనూ ఇమాన్యుల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. ఏ కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు మరియు తమిళ భాషల్లో అక్టోబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories