ప్యాన్ ఇండియన్ సినిమాల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్...

Siddharth: ఇంతకుముందు ప్యాన్ ఇండియా సినిమాల గురించి వాటి కలెక్షన్ల గురించి కామెంట్లు చేసిన ప్రముఖ హీరో సిద్ధార్థ...

Shireesha
Updated on: 20 May 2022 4:00 PM IST
Hero Siddharth Sensational Comments on PAN Indian Movies | Telugu Movie News
X

ప్యాన్ ఇండియన్ సినిమాల గురించి ఘాటు వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్...

Siddharth: ఇంతకుముందు ప్యాన్ ఇండియా సినిమాల గురించి వాటి కలెక్షన్ల గురించి కామెంట్లు చేసిన ప్రముఖ హీరో సిద్ధార్థ ఇప్పుడు మళ్లీ తన ఆసక్తికరమైన కామెంట్లతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం తన "ఎస్కేప్ లైవ్" సినిమాని ప్రమోట్ చేస్తూ మీడియాతో ఇంటరాక్ట్ అయిన సిద్ధార్థ ప్యాన్ ఇండియన్ సినిమాల గురించి మాట్లాడారు.

"ఒక సినిమా హిందీ లో ఎంత పెద్ద సక్సెస్ అయినా దాన్ని హిందీ సినిమా అనే అంటారు కానీ సౌత్ ఇండియా భాషల్లో విడుదలైన సినిమాలను మాత్రం ప్యాన్ ఇండియన్ సినిమాలు అంటారు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంటుంది. నా 15 ఏళ్ళ కరియర్లో నేను చాలా భాషలలో నటించాను. కానీ దాన్ని ఇండియన్ సినిమా గా చూడటానికే నేను ఇష్టపడతాను" అని చెప్పుకొచ్చారు సిద్ధార్థ్. "మా బాస్ మణిరత్నం 30 ఏళ్ల క్రితం రోజా అనే సినిమా తీశారు.

అది పాన్ ఇండియా సినిమా కాకపోతే మరి మీరు అనుకుంటున్న ప్యాన్ ఇండియన్ సినిమా అంటే ఏంటో నాకు తెలీదు. మీ కుటుంబంలో ఎవరినైనా రోజా సినిమా గురించి లేదా బాంబే సినిమా గురించి అడగండి. ఎవరు తీశారు అని అడగండి. అప్పట్లో వాటికి ప్యాన్ ఇండియా అనే టాక్ లేదు కానీ అవి అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకున్నాయి అని అన్నారు సిద్ధార్థ్. ఇక సౌత్ ఇండియా లో ఏదైనా సినిమా హిట్టయితే దానిని భారతీయ సినిమాగా కాకుండా ఆ భాషని రెప్రజెంట్ చేసే సినిమాగా మారుస్తున్నారని కానీ అలా కాకుండా ఏ భాష సినిమా అయినా దానిని ఇండియన్ సినిమాగా మాత్రమే చూడాలి అని చెప్పుకొచ్చారు సిద్ధార్థ్.

Shireesha

Shireesha

Next Story