అవి నా వల్ల కాదు: సిద్ధార్థ్

అవి నా వల్ల కాదు: సిద్ధార్థ్
x
Siddharth
Highlights

బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్ర్రీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్ కి మొదట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హిట్లు...

బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్ర్రీ ఇచ్చిన హీరో సిద్ధార్థ్ కి మొదట్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి హిట్లు వచ్చాయి. ఈ సినిమాలతో సిద్ధార్థ్ కి యూత్ లో మంచి క్రేజ్ కూడా ఏర్పడింది. కానీ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ అతన్ని పలకరించాయి. దీనితో ఇప్పుడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు సిద్ధార్థ్..

అయితే సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటాడు సిద్ధార్థ్.. రాజకీయపు విషయాలపైన ఎక్కువగా అందులో స్పందిస్తూ ఉంటారు. అయితే అయన రాజకీయాల్లోకి రాబోతున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. తాజాగా టక్కరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సిద్ధార్థ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పొలిటికల్ ఎంట్రీ పైన స్పందించాడు.

తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని, రాజకీయాల్లో ఉండాలంటే చాలా విషయాలు తెలిసి ఉండాలని అన్నాడు. తనలా మాట్లాడేవాళ్లు రాజకీయాల్లో ఉండలేరని, రాజకీయాల్లో ఉండాలంటే ఏ విషయం ఎక్కడ చెప్పాలో తెలిసి ఉండాలన్నారు. తనకు నిజం మాట్లాడటమే తెలుసని, ఒకవేళ సమస్యలపై స్పందిచకపోతే తప్పు చేసినట్లుగానే భావిస్తానని, పాలిటిక్స్ నా వల్ల కాదని, సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్ లు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమేనని సిద్ధార్థ్ స్పష్టం చేశారు.

ఇక సిద్ధార్థ్ టక్కర్ మూవీ విషయానికి వస్తే ఇందులో విభిన్నమైన పాత్రల్లో సిద్దార్థ్ కనిపించనున్నాడు. ఫ్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుధన్ సుందరం, జయరాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు కార్తిక్ జీ క్రిష్ తెరకెక్కిస్తున్నారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories