Sharwanand: రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్

* ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు

admin1
Updated on: 22 Sept 2021 8:00 PM IST
Sharwanand Ready to do One more Action Thriller Movie
X

యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శర్వానంద్(ఫోటో-ది హన్స్ ఇండియా)


Sharwanand: తమిళంలో సూపర్ హిట్ అయిన "96" సినిమాకి తెలుగు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులు అందరి దృష్టిని ఆకర్షించారు. యువ హీరో శర్వానంద్ తాజాగా ఇప్పుడు "ఆర్ఎక్స్ 100" సినిమా తో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా హీరోగా నటిస్తున్న "మహా సముద్రం" సినిమా కాకుండా శర్వానంద్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాలో కూడా నటించనున్నారు. గత కొంత కాలంగా శర్వానంద్ మరియు కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ అయిన రాజు సుందరం కి మధ్య కథ డిస్కషన్లు జరుగుతున్నాయట.

ఎట్టకేలకు ఈ మధ్యనే ఈ సినిమా లాక్ అయ్యింది. ప్రముఖ రచయిత మరియు దర్శకుడు వక్కంతం వంశీ ఈ సినిమాకి స్క్రిప్ట్ ని అందిస్తున్నారు. కథ చాలా బాగా నచ్చడంతో శర్వానంద్ వెంటనే ఎస్ చెప్పినట్లు సమాచారం. రాజు సుందరం ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఒక ఆసక్తికరమైన యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుం

admin1

admin1

Next Story